ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన రద్దయింది. ఈరోజు ఆయన తిరుపతిలో జరగనున్న మహిళ సాధికారికత సదస్సులో పాల్గొనాల్సి ఉంది. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి పదకొండు గంటలకు సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది.
వాతావరణం అనుకూలించక…
తిరుపతి – అమరావతి మధ్య దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ పర్యటనకు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దట్టమైన మేఘాలు ఏర్పడినందున ప్రయాణానికి అనుమతించబోమని తేల్చి చెప్పడంతో చంద్రబాబు తన తిరుపతి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.