ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సుపై సన్నాహక భేటీని జరపనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
చర్చించాల్సిన అంశాలను… జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చించాల్సిన అంశాలతో పాటు అజెండాను రూపొందించడానికి చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కళాశాల వ్యవహారం వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ అంశాలు చర్చించాలి? కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఈసమావేశంలో చర్చ జరగనుంది.