ఐదు దశాబ్దాల నా రాజకీయ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజు. నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా గడ్డ కుప్పంలో కృష్ణా జలాలు పారించిన రోజు. 1999లో నా చేతుల మీదుగా హంద్రీ-నీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి… ఈరోజు కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చినంత వరకు ఎన్నో వ్యయప్రయాసలు పడ్డాను. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాను. కానీ పట్టుదలతో హంద్రీ-నీవా పూర్తికి సంకల్పం తీసుకున్నాను. దాని ఫలితమే గత నెలలో మల్యాల నుంచి నీటిని విడుదల చేసి రాయలసీమ జిల్లాలకు నీరిచ్చాం. చరిత్ర సృష్టించాం.
నేడు చిత్తూరు జిల్లాలో చిట్టచివరి భూములకు జలకళ తెచ్చాం. 738 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో… ప్రజల్లో ఆనందం చూసి ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు పరమ సముద్రం సమీపంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చాను. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరిచ్చి, సస్యశ్యామలం చేస్తానని మాటిస్తున్నాను.