విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నా నారా లోకేష్. ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు గారి సాంకేతిక విప్లవం సెకెండ్ చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన, 50కి పైగా యూనికార్న్ ల అభివృద్ధే లక్ష్యం. చంద్రబాబు గారి విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచపటంలో అమరావతి క్యాంటమ్ కు చోటు దక్కేలా కృషిచేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
