మరోవైపు.. కన్నప్ప కథ, సినిమా ముందు చోటుచేసుకున్న వివాదాలు, మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈ సినిమా రివ్యూ, పబ్లిక్ టాక్ గురించి ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ సైతం సినిమా బాగుందని చెప్పడంతో అంచనాలు పెరిగాయి. దీంతో కన్నప్ప సినిమా (Kannappa Movie) గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.
భారత్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, కేరళలో కన్నప్ప సినిమా గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు.