సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కేఎస్ఆర్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు.. సోమవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కేఎస్ఆర్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు.. సోమవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
కాగా.. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేనిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.
ఓ టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.