Andhra Pradesh :గుడ్ న్యూస్..కొత్త పెన్షన్లు కావాలా? ఇవే అర్హతలు

Andhra Pradesh :గుడ్ న్యూస్..కొత్త పెన్షన్లు కావాలా? ఇవే అర్హతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న వారికి మరో రెండు వారాల్లో తీపి కబురు అందనుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఏపీలోని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్త పెన్షన్లను డిసెంబరు నెల నుంచి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన విధివిధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త లబ్దిదారులను గుర్తించేందుకు అవసరమైన చర్యలను ఈ రెండు వారాల్లో తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. డిసెంబరు ఒకటో తేది నుంచి పాత వారితో పాటు అర్హులైన కొత్త వారికి కూడా పెన్షన్లను అందించనున్నారు. వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లను కూడా కొత్తవి మంజూరు చేయనున్నారు.

ఇందుకోసం పింఛను తమకు కావాల్సిన వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి అవసరమైన ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి 1. ఆధార్ కార్డు. 2. రేషన్ కార్డు 3. బ్యాంక్ అకౌంట్ బుక్ 4. ఆదాయపు పన్ను సర్టిఫికేట్ 5. కుల ధృవీకరణ పత్రం 6. సెల్ ఫోన్ నెంబరును సచివాలయ సిబ్బందికి అందచేయాల్సి ఉంది.తాము పింఛను ను అందుకోవడానికి వారికి అర్హతలను వారికి అందచేయాల్సి ఉంటుంది.

వితంతు పింఛన్లకు…

కొత్తగా వితంతు పింఛను ను పొందవలసిన వారు కూడా కొన్ని రకాలైన ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది వాటిని పరిశీలించి అర్ములో కాదో తేల్చనున్నారు. వితంతు పింఛను మంజూరు కోసం 1. ఆధార్ కార్డు 2. రేషన్ కార్డు 3. బ్యాంక్ అకౌంట్ బుక్ 4. ఆదాయపు ధృవీకరణ పత్రం 5. భర్త డెత్ సర్టిఫికెట్ 6. కుల ధృవీకరణ పత్రం 7. సెల్ ఫోన్ నెంబరును సచివాలయ సిబ్బందికి అందచేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి అధికారులు అర్హులైన వారికి కొత్త పింఛను మంజూరు చేయనున్నారు. గత కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు అందకపోవడంతో ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these