తనకు క్యాన్సర్ అని కుమార్తె క్రాంతి చేసిన కామెంట్స్ పై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తనపై అనవసరంగా బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారన్న ముద్రగడ పద్మనాభం.. తనను తన కుమారుడి నుంచి దూరం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే తాను తన కుమారుడి నుంచి దూరం కాబోనని తెలిపారు. తనకుమార్తె, అల్లుడి వల్లనే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఆ గడప తొక్కనంటూ…
తన చిన్నకొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్న ముద్రగడ పద్మనాభం తన కుమారుడి ఎదుగుదలను చూసి ఓవర్వలేక కొందరు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. ఎవరెన్ని ఏడ్పులు ఏడ్చినా తాను రాజకీయాలను వదిలిపెట్టనని తెిపారు. తన కూతురికి, తమకుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయన్న ముద్రగడ పద్మనాభం వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనకు క్యాన్సర్ వచ్చిందని, తన కుమారుడు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ముద్గగడ పద్మనాభం ఎన్ని జన్మలెత్తినా వారి గడప తొక్కనని చెప్పారు.