మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక.. చంద్రబాబు, లోకేశ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక.. చంద్రబాబు, లోకేశ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

తెలుగు దేశం పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద పండగగా భావించే మహానాడు కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు జనసేన అధ్యక్షులు, ఢిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మహానాడును ఒక చారిత్రక రాజకీయ వేడుకగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే అని.. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందన్నారు పవన్. ప్రతి ఏటా జరిగే మహానాడు వేడుక పండుగ లాంటిదన్నారు.

కడప సీకే దిన్నె వేదికగా టీడీపీ మహానాడు మొదటి రోజు అట్టహాసంగా జరిగింది. మహానాడు ప్రారంభంలో పహల్గామ్‌ మృతులకు, వైసీపీ హయాంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు నేతలకు కొద్దిసేపు మౌనం పాటించారు. టీడీపీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్‌ పరిణామాలపై రేపటి మహానాడులో చర్చించారు. రాయలసీమ గడ్డపై… కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగగా పునరుద్ఘాటించారు. ఈ శుభవేళ తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌‌లకు డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోందని వపన్ కల్యాణ్ అన్నారు. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి శుభాభినందనలు తెలిపారు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ పసుపు వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these