ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా పేరును మార్చి కడప జిల్లాగా మార్చాలని నిర్ణయించింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం జిల్లాకు పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. వైఎస్సార్ జిల్లాకు కడప పేరును కలపాలని గతంలోనే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కాగా 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఆయన సొంత జిల్లాకు పేరు పెట్టారు. కానీ, ఇప్పుడు ఆ పేరును తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.