Allu Aravind: పవన్ కల్యాణ్ ప్రకటనపై అల్లు అరవింద్ రియాక్షన్.. ‘ఆ నలుగురి’ పై ఏమన్నారంటే?

Allu Aravind: పవన్ కల్యాణ్ ప్రకటనపై అల్లు అరవింద్ రియాక్షన్.. ‘ఆ నలుగురి’ పై ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అంటూ గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.

‘రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడదామని ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. రెండు రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అనే పదాన్ని నెగిటివ్ షెడ్ లో రాస్తున్నారు. ఆ నలుగురికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నలుగురులో నేను లేను. ఆ నలుగురు కాస్త పదిమంది అయ్యారు.. చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఆ నలుగురు వ్యాపారంలో నేను లేను బయటికి వచ్చేసాను కోవిడ్ టైం లోనే. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక్క థియేటర్ అది కూడా AAA.. దానికి నేను ఓనర్. ఆంధ్రాలో కూడా నా దగ్గర ఒక్క థియేటర్ లేదు అన్ని వదిలేసుకుంటూ వచ్చాను. చివరకు 15 థియేటర్స్ వరకు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడూ లీజులు రెన్యువల్ చేయద్దు అని చెప్పాను. పాతా అలవాటు కొద్ది నన్ను అందరూ ఆ నలుగురు ఆ నలుగురు అని వాడుతున్నారు. పెద్దవాళ్ల ఫోటోలు ఏస్తే విమర్శలకు బాగుంటుంది కాబట్టి నా ఫోటో వేస్తున్నారు.. కాబట్టి మీడియా వాళ్ళు కోరేది ఏంటంటే ఆ నలుగురు అని రాసేటప్పుడు నా ఫోటో వెయ్యద్దు.. నా దగ్గర 15 కంటే ఎక్కువ థియేటర్స్ లేవు.. త్వరలోనే అవి కూడా నా చేతిలో నుంచి వెళ్ళిపోతాయి’

‘నా వృత్తి గత 50 సంవత్సరాలుగా సినిమాలు తీయడం. మధ్యలో చిన్న అవకాశం లాగా వచ్చింది ఇది. అది నాకు సరిపోదు అని బయటికి వచ్చేసా. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తాము అనే విషయం మీద ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్ లోను నేను వెళ్లలేదు.. కావాలనే వెళ్లలేదు.. మూడు మీటింగ్స్ జరిగాయి.. నేను వెళ్లకపోగా మా గీత అసోసియేట్ ప్రొడ్యూసర్స్ ని కూడా ఎవరిని వెళ్లదు అని చెప్పాను. స్టాండ్ అలోన్ థియేటర్స్ కు నిజంగానే చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఉన్నప్పుడు డిస్కస్ చేయడానికి ఛాంబర్ అనేది ఒకటి ఉంది. గిల్డ్ ఉంది. వీటిని అప్రోచ్ అయ్యి సమస్యలు సామరస్యంగా మాట్లాడుకొని.. అన్ని ఫెయిల్ అయితే అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే నిర్ణయానికి నేను వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడను అని చిరాకు కలిగి నేను వెళ్ళలేదు’

‘పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు రాబోతుండగా మేము థియేటర్లు మూసేస్తాం అనే దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను నేను.. మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆరోజు అశ్వినీ దత్ గారి సినిమా వస్తుంటే.. మేమందరం వెళ్లి టికెట్ రేట్ కోసం వెళ్లి కలిసాము. ఆ రోజే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసారా అని అడిగారు. ఛాంబర్ తరఫున వచ్చి కలవండి అని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వెళ్లి కలవాలి కదా.. కలవలేదు.. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా అది జరగలేదు. నిన్న ఎవరో మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండేళ్ల కింద పెద్దపెద్ద వాళ్లు అందరూ కలిసి ఎందుకు ప్రభుత్వాన్ని కలిశారు? ఏ వ్యాపారమైన ప్రభుత్వంతో కలిసి నడవాలి ఇది సరికాదు.. గవర్నమెంట్ తో సంబంధం ఉంటుంది వాళ్లకు కో ఆపరేషన్ కావాలి. అదే లేకపోతే గత ముఖ్యమంత్రిని ఎందుకు మనలో పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు కలిశారు. మనకు కష్టం వచ్చిందనే కదా కలిసాము. కష్టం వస్తే గాని కలవమా? మినిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు నేను కూడా చదివాను అవి చాలా సమంజసంగా ఉన్నాయి’

‘నిజంగానే థియేటర్స్ కు సమస్యలు ఉన్నాయి.. వాటికోసం ఏం చేయాలని ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఉండాలి.. మేము మూసుకుంటున్నాము థియేటర్లు.. మాతో సంభాషణకు రండి అని వాళ్ళు పిలిస్తే నేను మీటింగుకు వెళ్లలేదు. 1500 థియేటర్స్ ఉంటే నా దగ్గర కేవలం 15 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి.. ఆ నలుగురిలో నేను లేను అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సమస్య ఇంకా అవలేదు అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ కోపంలో న్యాయం ఉంది.. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్లు మూసేస్తాం అంటే ఆయనను బెదిరిస్తున్నారా ఏంటి. పవన్ కళ్యాణ్ సినిమా మీద వ్యతిరేకతతో చేసింది కాదు అని అంటారు కానీ.. అలా అనేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. 1500 థియేటర్లలో ఇండివిజువల్స్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి.. 700,800 థియేటర్స్ ఆ నలుగురు చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లు కొంతమంది గ్రూప్స్ చేతుల్లో ఉన్నాయి. ఇండివిజువల్ థియేటర్స్ చాలా ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు. ఏషియన్ చేతిలో పార్ట్నర్స్, ఓనర్స్, లీజు.. ఇలా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి దాన్ని ఏమంటారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెనక్కి వెళ్ళాలి అనుకునేవాళ్లు.. ఇంకోసారి కూడా మూసేయాలి అనుకుంటే మూసేస్తారు. గిల్డ్ వల్ల నిర్మాతలకు ఎక్కువ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. క్యూబ్ లో నేను పార్ట్నర్ కాదు.. UFO సురేష్ బాబు గారి చేతిలో లేదు ‘ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these