స్వచ్ ఆంధ్ర – స్వచ్ దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన SASA E-waste Check campaign కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి గారు, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ అనంతరం ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు వల్ల కలిగే అనర్ధాల కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు…మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అందరం పని చేద్దాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్ర అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు..