కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ ‘జింగుచా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌తో దేశం మొత్తం థగ్ లైఫ్ వైపు చూసింది. ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది.