ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ వయోపరిమితి పెంపు ఈ ఒక్క మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కటాఫ్ తేదీని 2024 జులై 1వ తేదీగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
