శ్రీరామనవమి సందర్బంగ ఆదివారం ఉదయం స్థానిక వి.ఎల్.పురం మార్గాని ఎస్టేట్స్ గౌరవ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవవం కన్నులపండువగా జరిగింది. పెద్దింటి వెంకట సుబ్బారాయుడు, శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని.సత్య శివ కుమార్ చక్కని వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. దాదాపు రెండుగంటల పాటు కల్యాణోత్సవం జరిగింది. బిసి రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన్ దంపతులు, భరత్ కుమార్తెలు జయని, శివాన్షి రామ్, సోదరుడు విజయకృష్ణ, సోదరి ఆరేపల్లి జోష్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, డా సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిఎస్ ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డా గన్ని భాస్కరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టికె విశ్వేశ్వర రెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమ్ దేవ్ తదితర ప్రముఖులు హాజరై , పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భరత్ దంపతులను ఆశీర్వదించారు. పెద్దఎత్తున జనం హాజరయ్యారు.
అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ సీతారాములు జగతికి ఆదర్శమని అటువంటి పుణ్య దంపతులకు గత ఏభై ఏళ్లుగా తమ కుటుంబం శ్రీరామ నవమి నాడు కల్యాణోత్సవం జరిపిస్తున్నామని అన్నారు. సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ప్రముఖులు, పెద్దఎత్తున జనం హాజరవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు రాముడు భరత ఖండాన్ని పరిపాలించి ఆదర్శంగా నిలిచాడో అలాగే మళ్ళీ అటువంటి రామరాజ్యం రావాలని, ఆంధ్రప్రదేశ్ కి పునర్వైభవం రావాలని భరత్ ఆకాంక్షించారు. ఇదే రాములవారిని కోరుకున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా కళకళ లాడుతూ ఉందో అదే తరహా రావాలని శ్రీరామచంద్రుణ్ని కోరుకుంటున్నామని భరత్ తెలిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ భోజనాలు ఏర్పాటుచేసారు.
