జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన శ్రీ Naga Babu గారు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలకు అనుగుణంగా బుధవారం శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
