సునీత విలియమ్స్ సాధించిందేంటి? జరిగిన పరిశోధనలేంటి..? ఐఎస్‌ఎస్‌కు మనమెప్పుడు..!

సునీత విలియమ్స్ సాధించిందేంటి? జరిగిన పరిశోధనలేంటి..? ఐఎస్‌ఎస్‌కు మనమెప్పుడు..!

9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఏం చేశారు సునీత విలియమ్స్‌? అసలు.. అంతరిక్షంలోకి వెళ్లిన వాళ్లు ఎలాంటి పరిశోధనలు చేస్తుంటారు? ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు భారత్ చేరుకునేదెప్పుడు? భారత్‌ సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ఎప్పుడు తయారు చేసుకుంటుంది. . అది సాకారం అయ్యేదెప్పుడు? అన్న చర్చ మొదలైంది.

రెండ్రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. చేపల వేటకు వెళ్లి 95 రోజుల పాటు నడి సముద్రంలో చిక్కుకుపోయాడో వ్యక్తి. అంతా చనిపోయాడనే అనుకున్నారు. ఆయన మాత్రం బొద్దింకలను కూడా వదలకుండా తిని బతికి బయటపడ్డాడు. కరోనా టైమ్‌లో లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. పెళ్లికి వెళ్లిన చుట్టాలు రోజుల తరబడి చిక్కుకుపోయారు. సరే.. చుట్టూ మనుషులు ఉంటారు కాబట్టి మరేం ఫర్వాలేదు. కొన్ని సినిమాల్లో చూసుంటాం. ప్రమాదవశాత్తు ఒకానొక దీవిలో నెలల పాటు అక్కడే చిక్కుకుపోతారు. సరే.. అది సినిమా కాబట్టి లైట్‌ తీసుకుంటాం. కాని, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో చిక్కుకుపోతే..! జస్ట్‌ ఓ ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేస్తానని వెళ్లిన వ్యక్తి.. 287 రోజుల పాటు అక్కడే ఇరుక్కుపోతే..! అందునా.. చిక్కుకుపోయింది చుట్టాల ఇంట్లోనో, ఓ దీవిలోనో, సంద్రంలోనో కాదు.. అంతరిక్షంలో. ఫైనల్లీ సునీత విలియమ్స్‌ భువికి దిగిరావడం అతిపెద్ద సక్సెస్‌, అంతా హ్యాపీ. అసలు.. అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి భారత్ క్రూ ఎప్పుడు వెళ్తుంది? అలాంటి ఘనత మనమెప్పుడు సాధిస్తాం. నిజానికి మార్స్‌పైకే రోవర్‌ను పంపించిన భారత్.. ఐఎస్‌ఎస్‌ను చేరుకోవడమే అతిపెద్ద ఘనత అని చెప్పుకోడానికి లేదు. కాకపోతే.. ఆ విజయం కూడా ఖాతాలో పడిపోతే ఓ పనైపోతుంది కదా? అసలు.. ఐఎస్‌ఎస్‌కు శాస్త్రవేత్తలు ఎందుకని అప్‌ అండ్‌ డౌన్‌ జర్నీ చేస్తుంటారు? అక్కడ చేస్తున్న పరిశోధనలు ఏంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these