నంద్యాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతల బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని టార్గెట్ చేసారు. బైరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. తన తల్లిపైన వ్యక్తిగత విమర్శలు చేసారని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుందని… శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరు ఏం అభివృద్ధి చేశారో చర్చించడానికి తాను సిద్దమని చెప్పిన శబరి… సిద్దార్ధ రెడ్డి సిద్దమా అంటూ ఎంపీ సవాల్ విసిరారు.
సిద్దార్ధకు సవాల్
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బైరెడ్డి అంటే తానేనని.. సిద్దార్ధ రెడ్డి కాదని పేర్కొన్నారు. కేసులు, అరెస్టుల గురించి సిద్దార్ధ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. తన ను అక్క అని చూడకుండా కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమ కార్యకర్తల పైన దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏనాడూ బయటకు రాని తన తల్లిపైన వ్యక్తిగత విమర్శలు చేశారని..తాను మర్చిపోనని స్పష్టం చేసారు. జగన్ తన తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎంపీ శబరి మండిపడ్డారు.
ఇప్పటి వరకు ఏమయ్యారు
తొమ్మది నెలలుగా సిద్దార్ధ రెడ్డి ఏమయ్యారని శబరి ప్రశ్నించారు. కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్దార్ధకు లేదన్నారు. కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలన జగన్ రావాలనుకుం టున్నారా అంటూ శబరి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అవినీతిని తమ ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెడుతుందని స్పష్టం చేశారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని.. సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అని సూచన చేసారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుందని… శిక్ష తప్పదని హెచ్చరించారు.
వదిలేదు
లేదు స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని మండి పడ్డారు. కూటమి హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని శబరి చెప్పుకొచ్చారు. కర్నూలు లో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.