ప్రతిపక్షం విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని,అధికార పక్షంపై ప్రతిపక్షం చేపట్టిన పోరుకు ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.
బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బొమ్మూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది.
జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు యువ నాయకులు జక్కంపూడి రాజా,జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమం పార్టీ శ్రేణులతో దద్దరిల్లింది.వేలాదిగా యువత తరలి వచ్చిందిఈ కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వగృహం నుండి బయలుదేరి నందం గనిరాజు జంక్షన్ బైపాస్ రోడ్డు తాడితోట స్టేడియం రోడ్ శ్యామల టాకీస్ జంక్షన్ కోటిపల్లి బస్టాండ్ ఐదు బల్ల మార్కెట్ మీదుగా రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయా నికి చేరుకుంది.అక్కడ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ గా వెళ్లి కలెక్టరేట్ లో విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.