ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో వెలసిన శ్రీ సరమ్మ పేరంటాలు తల్లి తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 8 వ తేది శనివారం నుండి 13 వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు.. మేళతాళాలతో డాన్సులతో, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగుతుంది. అనంతరం 13 వతేది మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశంతో తిరునాళ్ళ మహోత్సవములు ప్రారంభం అవుతాయి. 13వ తేదీ గురువారం నుండి 21వ తేది శుక్రవారం వరకు ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ సరమ్మ పేరంటాలు తల్లి తిరునాళ్ళ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
21వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం జరుగును
ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము.
ఇట్లు
దేవస్థానం కమిటీ
(శ్రీ సరమ్మ పేరంటాలు తల్లి తిరునాళ్ళ మహోత్సవములు)
లింగపాలెం,ఏలూరు జిల్లా