AP: కొల్లేరు ఆక్రమణలపై సర్వే ప్రారంభం

AP: కొల్లేరు ఆక్రమణలపై సర్వే ప్రారంభం

కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. గుడివాకలంక నుంచి అధికారులు సర్వేను ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో ఆక్రమణల వివరాలను సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సర్వే వివరాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. గతేడాది డిసెంబరు 11న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించాలని ఆదేశించింది.

క్షేత్రస్థాయిలో అటవీశాఖ సర్వే వివరాలపై డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. కొల్లేరు సరస్సులో సహజ నీటిప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఏపీ సర్కారును సుప్రీం కోర్టు ఆదేశించింది. గతేడాది డిసెంబరు 11న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these