తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రియాక్ట్ అయ్యారు. తనకు తెలుగుదేశం పార్టీ తో 23 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి తాను నిరంతరం పనిచేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి రాలేదని బాధ లేదన్న వర్మ తన అనుచరులు కూడా ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అనేక కారణాలుంటాయని…
ఎమ్మెల్సీ పదవి తనకు ఇవ్వకపోవడానికి అనేక కారణాలుంటాయని, చంద్రబాబు నాయుడు అన్ని పరిశీలించిన తర్వాతనే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ఉంటారని వర్మ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ పదవి ఎంపికలో అనేక ఈక్వేషన్లు పనిచేస్తాయని, అయినా తాను పార్టీ నిర్ణయానికి, నాయకత్వం అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఉంటానని వర్మ తెలిపారు.