ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. తనకు చంద్రబాబు దేవుడితో సమానమని, అప్పుడప్పుడు దేవుళ్లు భక్తులకు పరీక్ష పెడతుంటారని అన్నారు. తాను చంద్రబాబుగారి కోసం అంకిత భావంతో పని చేస్తానన్న బుద్దా వెంకన్న అనేక రకాల పరిణామాలను చూసుకుని ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించారని చెప్పారు. రాజకీయాలలో పదవులు అనేవి ఒక క్రీడ అని, ఒక్కోసారి గెలుస్తామని, ఒక్కోసారి ఓడతామని వెంకన్న చెప్పుకొచ్చారు.
పదవులు ఇచ్చినా…
తనకు పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా.. చంద్రబాబు జీవితాంతం తనకు దేవుడు అని అన్నారు. చంద్రబాబుని ఎవరు ఎక్కడా దూషించినా.. ీను ఇలాగే ముందుంటానని, వారికి సమాధానం చెబుతానని అన్న బుద్దా వెంకన్న తనకుకు ఎటువంటి నిరుత్సాహం లేదని, తనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తన దేవుడు చంద్రబాబుకి తెలుసునని చెప్పారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు, ఒక ఎస్సీకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారన్న వెంకన్న వారికి ఇవ్వడంలో న్యాయం ఉందని, టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టద్దని విజ్ఞప్తి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.