హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరు సమీపంలో సోమవరప్పాడు – చొదిమెళ్ళ వద్ద ఆగివున్న లారీని వెంకట రమణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. బస్సు నంబర్ NL 01 B 3092గా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
