“దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, పోలవరం RMC, నీటిపారుదల శాఖ, పంచాయితీ రాజ్ సహా వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ ” పోలవరం, పెరుగు గూడెం, చల్లచింతలపూడి నుంచి కొక్కిరపాడు వరకు పోలవరం కాలువ పై ప్రజల సౌకర్యార్థం నిర్దేశిత ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలని , అందుకు అవసరమైన ప్రణాలికను రూపొందించి అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు సూచించారు. అలాగే జానంపేట వద్ద పోలవరం కాలువపై OT నూతనంగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అదే విధంగా పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని డ్రెయిన్లు ప్రక్షాళన తో పాటు పెదపాడు మండలంలోని లోవేరు డ్రెయిన్ ను ఆధునీకరించేలా అంచానాలు సిద్దం చేయాలనీ సూచించారు. అదే విధంగా డ్రైన్లు మీద అవసర అవసరమైనచోట్ల నూతనంగా ఓటీలను ప్రారంభించేలాగా నీటి సంఘాల చైర్మన్లు ప్రణాళికలు రూపొందించి అందజేయాలని సూచించారు. ఆపరేషన్ & మెయింటేనెన్స్ డ్రెయిన్లులకు రూ.కోటి రూపాయలతో నిధులు మంజూరు చేస్తూ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు పూర్తి సహకారం అందిస్తున్నారని ,ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఇంటి స్థలం కలిగి సొంతింటి కలను సాకారం చేయాలనుకునే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున రుణాలు మంజూరు చేసేలాగా ఆసక్తి కలిగిన అర్హుల జాబితాలను స్థానిక కూటమి నాయకులు సత్వరమే సిద్ధం చేసి అందజేయాలని కూటమి నాయకులకు సూచించారు.
పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో దెందులూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 12కోట్లు రూపాయలతో NREGS పనులు మంజూరు కాగా , వాటితో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల స్థితిని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు సమీక్షించారు.. డ్రెయిన్లు కి రమన్నాయుడ్ సహకారం అందిస్తాం అన్నారు..
అదే విధంగా దెందులూరు మండలం లోని రామారావు గూడెం నుంచి చల్లచింతలపూడి వరకు, గోపన్న పాలెం నుంచి పెదవేగి వరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న పోలవరం కుడి కాల్వ గట్టు బిటి రోడ్డు పనులు సత్వరమే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి మిల్లు బాబు, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా ,నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, ఏలూరు ఇరిగేషన్ మరియు RMC డివిజన్ EE దేవ ప్రకాష్, సత్రంపాడు, ఏలూరు, భీమడోలు సబ్ డివిజన్లు కి చెందిన RMC DE లు, J.E. లు, AE లు, మైనర్ ఇరిగేషన్ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సహా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.