Chandrababu: కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

Chandrababu: కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి అభ్యంతరం చెప్పడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం అభ్యంతరం తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వృధా నీటితో బనకచర్ల కడితే నష్టమేంటని.. కాళేశ్వరం కడితే తాము అభ్యంతరం తెలిపామా..? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.. నీరు వృధా కాకుండా మీరూ ప్రాజెక్ట్‌లు కట్టుకోండి అంటూ సూచించారు.. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని.. కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దు.. అంటూ చంద్రబాబు సూచించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల లింక్ ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేసిందని రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌కు కంప్లయింట్​ చేసిన కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించడం చర్చనీయాంశంగా మారింది.. ఈ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these