ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరిపోయేలా నిర్వహించేందుకు రెడీ అవుతోంది జనసేన పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసేలా ఏర్పా్ట్లు ఉంటాయంటున్నారు నేతలు. కాకినాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆవిర్భావ సభ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇంతకు సభ ఎక్కడ…? ఎప్పుడు…?
ఈసారి ఆవిర్భావ సభ మామూలుగా ఉండకూడదు..! తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాలంటూ.. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు జనసేన నేతలు. కాకినాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే సభకు.. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి జనసేన శ్రేణులు ఉవ్వెత్తున తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపై ఉందన్నారు జనసేన నేతలు.
ఇప్పటికే పిఠాపురం శివారు చిత్రాడలోని సభాస్థలిని పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగాలకు సంబంధించి సూచనలు చేశారు. మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. కాకినాడ జనసేన నేతలకు కీలక సూచనలు చేశారు.