అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

అమరావతి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్

వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్

పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయింపు

బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు

వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు

జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం

పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు

ఇందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన ఆర్థిక మంత్రి

వ్యవసాయ శాఖకు 11636 కోట్లు

సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు

ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు

రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు

బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.322359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది ఏపీ బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ. 79,926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది.

బడ్జెట్ లెక్కలు ఇలా..

  1. సూపర్‌సిక్స్‌ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15వేల రూపాయలను కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనంతో పాటు, మొత్తం పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లను కేటాయించారు.
  2. అమరావతి నిర్మాణానికి ఆరువేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇవన్నీ బయటనుంచి వచ్చేనిధులు అనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతికి నిధులు కేటాయించడం లేదని పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,705 కోట్లను, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లను కేటాయించారు.
  3. మొత్తం మూడు లక్షల 22వేల 359 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రెండు లక్షల 51వేల, 162 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉండొచ్చనీ, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు,ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉండొచ్చని పయ్యావుల కేశవ్‌ అంచనా వేశారు.
  4. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా లేచి నిలబడగా లేనిది.. ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టలేమా అనే మాటల స్ఫూర్తితో ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these