గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కోనాయిచెరువు రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు అక్రమంగా జరిపినట్లు ఫిర్యాదులో తెలిపారు. తొండెంగట్టు చెరువులో మట్టి తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా వల్లభనేని వంశీ వర్గీయులు చేపట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించింది. దీంతో పోలీసులు మరో కేసును వల్లభనేని వంశీపై నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
వరస కేసులతో…
గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశీపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బెదిరింపులు, కిడ్నాప్ వంటి కేసులు నమోదయ్యాయి. రోజుకొక ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు వాటిని పరిశీలించి కేసును నమోదు చేసేందుకు సిద్ధమవుతను్నారు.