మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్ట్లు చేశారు. భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని శివరాత్రి రోజు దర్శించుకుంటే శుభప్రదమని అందరూ భావించడంతో భక్తులతో శ్రీశైలం దేవస్థానం కిటకిటలాడిపోతుంది.
శివరాత్రి కావడంతో…
సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవను నిర్వహిస్తారు. అనంతరం రాత్రి పది గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకా్న్ని నిర్వహిస్తారరు. రాత్రి పన్నెండు గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని నిర్వహిస్తారు. నేటి రాత్రికి కూడా భక్తులు శ్రీశైలంలో ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేవారు.