తల్లికి వందనంపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్ డేట్ ఇచ్చారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తల్లికి వందనం మే నెల నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏడాది తల్లుల ఖాతాల్లో విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇందులో తాము వెనక్కు తగ్గబోమని ఆయన తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని… అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ నెలలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయల నగదును జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆందులో ఎవరూ సందేహ పడాల్సిన పనిలేదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.