అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఈ సమావేశా లకు హాజరైంది. గవర్నర్ ప్రసంగం సమయంలో పోడియం వద్దకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. ప్రజాస్వామ్యం పరిరక్షించాలని నినాదాలు చేసారు. ఆ తరువాత వాకౌట్ చేసి వెళ్లిపోయారు. సభలో వైసీపీ వ్యవహరించిన తీరు పైన డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జగన్ కు ప్రతిపక్ష హోదా పైన క్లారిటీ ఇచ్చేసారు.
పవన్ వ్యాఖ్యలు అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసనకు దిగింది. పోడియం వద్ద నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే వైసీపీ డిమాండ్ పైన పవన్ స్పందించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గత ప్రభుత్వంలో ఉన్న సభ్యులుగా ఉన్న వారి ప్రవర్తన సరిగా లేదని వ్యాఖ్యానించారు. గవర్నర్ నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంలో ఉండి కూడా బడ్జెట్ పై సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కావాలని గందరగోళం సృష్టించారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చేదని గుర్తించాలన్నారు.
ఈ అయిదేళ్లు దక్కదు జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ ఉన్న వారికీ ప్రతిపక్ష హోదా ఉండేదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద సభ్యులు జనసేనకు ఉన్నారని చెప్పారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసారని గుర్తు చేసారు. వారి సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీలో అవకాశం వస్తుందని పవన్ పేర్కొన్నారు. వైసీపీ శాసన సభ్యులు హుందా గా ఉండాలని సూచించారు. లోటు పాట్లు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. అసెంబ్లీ లోకి వచ్చి గొడవ పెట్టుకోవాలి, విభేదాలు పెట్టుకోవాలి ఆలోచనతో వస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష హోదా ఈ అయిదు సంవత్సరాల కాలంలో దక్కదని పవన్ తేల్చి చెప్పారు.
జర్మనీకి వెళ్లండి ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి, లేదా పార్టీలు ఇచ్చేది కాదన్నారు. ఎవరైనా ప్రోటోకాల్స్ బ్రేక్ చేయమని చెప్పుకొచ్చారు. వైసీపీ కి వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా హోదా దక్కదన్నారు. జర్మనీ లో ఉన్న విధానం ఇక్కడ అమలు చేయాలని కోరే వారే అక్కడ అలా ఉంటే జర్మనీకే వెళ్లాలని పవన్ సూచించారు. వైసీపీ మాత్రం సభలో మూడు పార్టీలు అధికార కూటమిగా ఉండటంతో ఏకైక ప్రతిపక్ష పార్టీ తమదే ఉందని..తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశం పైన న్యాయ పరంగానూ పోరాటం చేస్తోంది. ఇప్పుడు హోదా విషయంలో పవన్ తేల్చి చెప్పటంతో.. ఇక, జగన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.