28న ఏపీ కేబెనెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం

28న ఏపీ కేబెనెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 28వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఈ నెల 24 వ తేదీన ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25 నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాలు సభలో నిర్వహింస్తారు.

28న బడ్జెట్…

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ నెల 28వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025 – 26 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ను ఆమోదించడానికి ఆరోజు ఉదయం మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these