ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానున్నట్లు తెలిసింది. రేమండ్ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారుగా రూ.1000 కోట్లు విలువైన పెట్టుబడులను రేమండ్ లిమిటెడ్ ఏపీలో పెట్టనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. గార్మెంట్స్, ఏరో, డిఫెన్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఇతర ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగానే రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏపీ ప్రభుత్వంతో కలిసి జాయింట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టానికి సహకారం అందిస్తామని చెప్పినట్లు తెలిసింది.
డెనిమ్, లెనిన్, కాటన్, ఉన్ని, నేత వస్త్రాలకు సంబంధించి షర్ట్ అండ్ సూట్ మెటీరియల్ రేమండ్ అందిస్తుంది. అలాగే పార్క్స్ ఎథ్నిక్స్, పార్క్ అవెన్యూ, రేమండ్ రెడీ టు వేర్, కలర్ప్లస్ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. మనదేశంలో రేమండ్, దాని బ్రాండ్లు.. 20,000 కంటే ఎక్కువ సేల్స్ పాయింట్లతో భారీ నెట్వర్క్ కలిగి ఉన్నాయి. 600 పట్టణాలలో 1500 కంటే ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, కెనడా, యూరప్, జపాన్ సహా 60 కంటే ఎక్కువ దేశాలలో రేమండ్ సూట్లకు ఆదరణ ఉంది.