ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం అక్కడి నుంచి తర్వాత జరిగే ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు.
కేంద్ర మంత్రులను…
మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పోలవరం నిర్మాణంపై చర్చించనున్నారు. తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర విభజన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయ అధికారులతో సమావేశమై మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరనున్నారు. మరికొందరు మంత్రులను కూడా కలిసే అవకాశముంది.