అంజనమ్మ బర్త్‌డే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన చిరంజీవి

చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సెలబ్రేషన్స్

చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. మెగా ఫ్యామిలీ తమ ఇంట్లో వేడుకగా బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. చిరంజీవి ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన నాయనమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక కేక్ కట్ చేయించి అందరూ ఆప్యాయంగా అంజనమ్మని విష్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ లుక్కేద్దాం రండి.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి కూడా తన తల్లికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. తల్లికి చిన్న సర్‌ప్రైజ్ ఇస్తూ చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

పుణ్యం చేసుకున్నాం

“అమ్మా.. ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. నీ గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు.. నిన్ను ఎంత ప్రేమిస్తున్నామో చెప్పలేం.. నువ్వంటే మాకు ఎంత గౌరవమో నువ్వు కూడా ఊహించలేవు. హ్యాపీ బర్త్‌డే అమ్మ.. మన కుటుంబానికి నువ్వొక స్వీట్ హార్ట్. మా బలం నువ్వు.. స్వచ్ఛమైన ప్రేమ నువ్వు.. ఇట్లు నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి.” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these