జానీ మాస్టర్‌ని వదిలేది లేదు .. తేల్చేసిన శ్రేష్టి వర్మ, అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్?

జానీ మాస్టర్‌ని వదిలేది లేదు .. తేల్చేసిన శ్రేష్టి వర్మ, అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళ డ్యాన్స్ మాస్టర్ చేసిన ఆరోపణలు గతేడాది దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అన్నింటిలోకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ నిలిచిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.

కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌కు జానీ ఎంపికయ్యారు. 2022 సంవత్సరానికి గాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం సినిమాకు గాను ఆయనను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే లైంగిక వేధింపులు, పోక్సో వంటి బలమైన కేసులు నమోదు కావడంతో జానీ మాస్టర్‌ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కీలక ప్రకటన చేసింది. బెయిల్‌పై బయటికొచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన సినిమాలు, కొరియోగ్రఫీ పనుల్లో తిరిగి బిజీ అయ్యారు. అలాగే తాను ఏ తప్పు చేయలేదని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని జానీ మాస్టర్ అతని భార్య మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

కాగా.. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టీ వర్మ ఈ వివాదం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. నాలుగేళ్ల క్రితం వేధిస్తే జానీపై ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారని.. కానీ అప్పుడు తాను మైనర్‌నని, దీనికి తోడు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తిగతో పోరాడే శక్తి నాకు లేదని శ్రేష్టీ వర్మ చెప్పారు. జానీ మారతాడేమోనని అనుకున్నానని.. కానీ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కానని ఆమె పేర్కొన్నారు. కేసు విషయంలో నా ఫ్యామిలీ, మీడియా, సన్నిహితులు, నార్సింగి పోలీసులు తనకు ఎంతో మద్ధతలుగా నిలిచారని శ్రేష్టీ వర్మ గుర్తుచేసుున్నారు. సమీర్ అనే వ్యక్తితో నాపై ఫిర్యాదు చేయించారని.. ఇదంతా జానీ మాస్టర్ భార్య ఆడుతున్న డ్రామా అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని జానీపై కేసు పెట్టలేదని.. కేవలం ఆత్మాభిమానం కోసమే ఫిర్యాదు చేశానని శ్రేష్టీ చెప్పింది. అమ్మాయి అంటే ఆట వస్తువు కాదని.. వాళ్లు నో చెప్పారంటే నో అంతే, దానిని గౌరవించాలని ఆమె తేల్చేశారు. జానీ మాస్టర్‌ను వదిలేది లేదని ఫైట్ చేస్తానని అది సొసైటీ గురించి కాదని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమని శ్రేష్టీ వర్మ చెప్పారు.

ఇకపోతే.. జానీ అరెస్ట్ వెనుక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా దీనిపైనా శ్రేష్టీ వర్మ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్‌కు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అలాగే జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డ్ రద్దు కావడం వెనుక కూడా తాను లేనని శ్రేష్టీ వర్మ వెల్లడించారు. జానీపై వచ్చిన ఆరోపణలు, కేసు వల్లే ఆయన అవార్డ్ రద్దు అయ్యిందన్నారు. ప్రస్తుతం శ్రేష్టీ వర్మ వ్యాఖ్యలు చిత్ర సీమలో వైరల్ అవుతుండగా.. దీనిపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these