యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్2 మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. దీనిద్వారా నేరుగా హిందీ చిత్రంలో నటించి అక్కడ మార్కెట్ ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలో నటించే అవకాశం ఉంది. దేవర2 చేయాలా? వద్దా? అనేది కొరటాల శివ తయారుచేసే స్క్రిప్ట్ ను బట్టి ఉంటుంది.
అరుదైన రికార్డును నెలకొల్పిన తారక్ గతేడాది విడుదలైన దేవర1 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. 2024లో అత్యధిక సంఖ్యలో మాట్లాడుకున్న ట్విటర్ ఖాతాలో తారక్ 10వ స్థానంలో నిలబడ్డాడు. తెలుగు నుంచి టాప్10లో నిలిచిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. ట్విటర్ లో అత్యధిక సంఖ్యలో మాట్లాడుకుంది మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి. ఈ జాబితాలో ఆయన ప్రథమస్థానంలో నిలిచారు. ఇదే జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కొహ్లి రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో తనకు 300 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రికెటర్ రోహిత్ శర్మ మూడోస్థానంలో నిలవగా, తమిళ హీరో విజయ్ నాలుగో స్థానంలో నిలిచారు. 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 6వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, 7వ స్థానంలో మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, 8వ స్థానంలో షారుక్ ఖాన్, 9వ స్థానంలో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, 10వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
అతను అద్భుతమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అంతర్జాతీయస్థాయిలో ప్రఖ్యాత దర్శకులు, నటుల నుంచి ఆ సినిమాలో తారక్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తనతో సినిమా తీయడానికి తాను సిద్ధమేనని హాలీవుడ్ సూపర్ మ్యాన్ దర్శకుడు, నిర్మాత జేమ్స్ గన్ అన్నారు. ఆర్ఆర్ఆర్ లో వ్యాన్ లో నుంచి పులి, ఇతర జంతువులతోపాటు బయటకు దూకే నటుడితో కలిసి తాను పనిచేయడానికి ఇష్టపడతానని, అతను అద్భుతమైన నటుడని, చాలా బాగా నటించాడంటూ ప్రశంసలు కురిపించారు.