హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై అదిరిపోయేలా ఎయిర్ షో

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై అదిరిపోయేలా ఎయిర్ షో

హుస్సేన్ సాగర్‌పై అద్భుతంగా వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఒకే సారి ఆకాశంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ సందడి చేస్తున్నాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమమైన 5 బృందాల్లో సూర్యకిరణ్ టీమ్ ఒకటిగా పేరుపొందింది. ఎయిర్‌ షో‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

 ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఇవాళ(ఆదివారం) ఎయిర్‌ షో జరుగుతోంది. ట్యాంక్‌బండ్ దగ్గర ఎయిర్‌ షో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎయిర్‌ షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకిస్తున్నారు. కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో వైమానిక విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షోను చూడటానికి ట్యాంక్‌బండ్‌కు జనం భారీగా తరలి వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

హుస్సేన్ సాగర్‌పై అద్భుతంగా వైమానిక విన్యాసాలు అదరగొడుతున్నాయి. ఒకేసారి ఆకాశంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ సందడి చేస్తున్నాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమమైన 5 బృందాల్లో సూర్యకిరణ్ టీమ్ ఒకటిగా పేరుపొందింది. ఎయిర్‌ షో‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు వడ్డే శంకర్ బృందం పాటల ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 6:45 గంటల వరకు నీలా అండ్ టీం బోనాలు కోలాటం ప్రదర్శన జరుగుతోంది. 6:45 గంటల నుంచి 8 గంటల వరకు మోహిని అట్టం, భరతనాట్యం, థియేటర్ స్కిట్ ప్రదర్శిస్తారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీం మ్యూజికల్ నైట్ ఉంటుంది.

ఎయిర్ షో‌లో పోలీసుల అత్యుత్సాహం

కాగా ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని జనం అంటున్నారు. మీడియా ప్రతినిధులను పాసులు ఉన్నప్పటికీ లోపలికి పోలీసులు అనుమతించండం లేదు. పోలీసుల కుటుంబ సభ్యులు, స్నేహితులను ఎలాంటి పాసులు లేకపోయిన పక్క దారిన పంపుతున్నారని పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఓవరాక్షన్‌‌పై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these