అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Nadendla Manohar గారు ఆకస్మిక తనిఖీ

పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

* ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని పోర్టులోనే ఉంచిన అధికారులు.

* రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం స్వయంగా వెళ్లి చూసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

* కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపాటు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం.

* బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశం.

* అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా కోర్టు నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను కోర్టు అధికారులను ప్రశ్నించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these