నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరంజీవి సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని కూడా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యువీ క్రియేషన్స్ లో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్రిష, ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా మరింతమంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం విశ్వంభర సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా ఫస్ట్ లుక్ అంటూ మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చిరంజీవి త్రిశూలం పట్టుకొని ఓ భారీ కొండపై కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు ఉంది.ఈ పోస్టర్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది.
సోషియో ఫాంటసీ అని సినిమాని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ చూస్తేనే సినిమా దానికి తగ్గట్టు ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ పుట్టిన రోజున ఇలాంటి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 న రిలీజ్ కాబోతుంది.