టాలీవుడ్‌ నుంచి కేరళకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మొదటి హీరో అ‍ల్లు అర్జున్‌..

కేరళలో భారీ వర్షాలతో వయనాడ్‌ ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. భవిష్యత్‌లో ఎప్పుడు కోరుకుంటారో చెప్పలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. జులై 29 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్‌ సాయం చేసి అండగా నిలిచారు. అయితే, తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భారీ విరాళం అందించారు.

టాలీవుడ్‌ నుంచి కేరళకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మొదటి హీరో అ‍ల్లు అర్జున్‌ కావడం విశేషం.కేరళలోని విపత్తు గురించి అల్లు అర్జున్‌ ఇలా ట్వీట్‌ చేశారు. ‘వాయనాడ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు.

ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి క్షేమం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత, బలంగా నిలబడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.సూర్య, జ్యోతిక, కార్తీ ఫ్యామిలీ రూ. 50 లక్షలు… విక్రమ్ రూ. 20 లక్షలు, మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్‌ రూ. 15 లక్షలు,ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ. 10 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ.25 లక్షలు, నయనతార దంపతులు రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these