శివం భజే..ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..

కుర్ర హీరో అశ్విన్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ శివం భజే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది.. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..

నటీనటులు : అశ్విన్ బాబు, దిగంగాన సూర్యవంశీ, అర్భాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజి, తులసి,తనికెళ్ల భరణి, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్ తదితరులు.

ఎడిటింగ్ : ఛోటా కె ప్రసాద్

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్

నిర్మాత : మహేశ్వర్ రెడ్డి

దర్శకత్వం :అప్సర్

కథ విషయానికొస్తే :

ఈ సినిమాలో లోన్ రికవరీ ఏజెంట్‌గా అశ్విన్ బాబు నటించారు. ఇక కథ విషయానికి వస్తే.. చైనా, పాకిస్థాన్ కలిసి మన దేశంపై మరో కుట్రకు తెర లేపుతారు. కరోనా వైరస్ మాదిరి ఓ డేంజరస్ వైరస్‌ను మన దేశంలోని ప్రజలపై ప్రయోగించాలని పన్నాగం పన్నుతారు. అయితే వారి పన్నాగాన్ని లోన్ రికవరీ ఏజెంట్ శేఖర్ (అశ్విన్ బాబు) ఎలా అడ్డుకున్నాడనేది మిగితా కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే :

ఈ మధ్య తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఇక ‘శివం భజే’ కూడా మంచి కాన్సెప్ట్‌తో వచ్చింది. మన శతృ దేశాలపై చైనా, పాకిస్థాన్ కలిసి ఎలా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పన్నుతాయనే కాన్సెప్ట్ కామన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసాడు దర్శకుడు. లోన్ రకవరీ ఏజెంట్ గా పనిచేస్తోన్న క్రమంలో హీరోయిన్‌ను కలుస్తాడు హీరో. అయితే ఈ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. హీరోయిన్ ఓ పెద్ద సైంటిస్ట్ అయివుండి.. ఓ లోన్ రికవరీ ఏజెంట్‌ను ఎలా ప్రేమిస్తుందనే విషయం ఆకట్టుకోదు. ఇక దర్శకుడు తను ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఇబ్బందిపెడుతాయి. ఇక శతృ దేశపు పన్నాగాలను అరికట్టడంలో శేఖర్ కు దైవ భక్తి ఎలా తోడైందనేది కామన్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ న ఇంకాస్త మంచిగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా దేశ భక్తికి దైవ భక్తి జోడించి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో చూసి ఓసారి ఎంజాయ్ చేయోచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే :

హీరోగా నటించిన అశ్విన్ బాబు తన యాక్షన్‌తో పాటు నటనతో మెప్పించాడనే చెప్పోచ్చు. హీరోయిన్‌గా నటించిన దిగాంగన సూర్యవంశీ కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన హైపర్ ఆది తన కామెడీతో ఓకే అనిపించాడు. చాలా కాలం తర్వాత తెలుగులో అర్భాజ్ ఖాన్ నటించి అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో నటించిన మురళీ శర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ఉన్నంతలో తమ పరిది మేరకు నటించారు.దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారని అర్థమవుతోంది. సినిమా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడు అందులో లీనమయ్యేలా ఫ్రేమ్ తో ఫ్రేమ్ కనెక్ట్ చేశాడు. డైరెక్టర్ టాకింగ్ సినిమాకు మేజర్ అట్రాక్షన్. సంగీతం ఓకే.

ప్లస్ పాయింట్స్ :

కథ నేపథ్య సంగీతం

నిర్మాణ విలువలు..

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

లాజిక్ లేని సీన్స్

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these