ఒటమి తరువాత జగన్ లో మార్పు కనిపిస్తోంది. పార్టీ కేడర్ కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు..ప్రజలకు అందుబాటులో లేకపోవటం పార్టీ శ్రేణులకే నచ్చలేదు.
ఓటమికి ఇది కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. సీఎంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం దక్కలేదనే విమర్శలు వినిపించాయి. దీంతో, జగన్ తన వైఖరి మార్చుకుంటున్నారు. తాను మారుతున్నాననే సంకేతాలు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇక నుంచి పార్టీ నేతలు..కేడర్ తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల 15వ తేదీ నుంచి తాడేపల్లి తన నివాసంలోనే ప్రజాదర్బార్ కు సిద్దం అవుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవటానికి వీలుగా గ్రిల్ నిర్మాణం పూర్తి చేసారు. కానీ, జగన్ అనేక సార్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినా..నిర్వహించలేదు. ప్రజలతో మమేకం కావటం పైన సొంత పార్టీలోనే జగన్ పైన విమర్శలు వచ్చాయి.నేరుగా కలిసేలావైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో నిర్వహించిన తరహాలోనే ప్రజాదర్బార్ నిర్వహించాలని పలువురు పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ కు సూచించారు. అయిదేళ్ల పాటు జగన్ నేరుగా జనం తనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు.
పార్టీ ఎమ్మెల్యేలు సైతం నేరుగా కలవలేని పరిస్థితులు ఎదుర్కొన్నామని ఎన్నికల ఫలితాల తరువాత పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. సజ్జల అంతా తానై వ్యవహరించారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఓటమి తరువాత జగన్ లో మార్పుల మొదలైంది.ఓటమితో మార్పుపులివెందులకు వెళ్లిన సమయంలోనూ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానీకం జగన్ ను కలిసేందుకు వస్తున్నారు.
ఇదే విధంగా తాడేపల్లిలోనూ ప్రజాదర్బార్ నిర్వహించాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తరువాత జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. అయితే, జగన్ ప్రజాదర్బార్ గురించి పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.