ఏపీలో తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల..

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

టీడీపీ అధికారంలోకి రాగానే గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కార్ ‘తల్లికి వందనం’గా మార్చింది. తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేల సాయం అందిస్తామని పేర్కొంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే ఈ సూచనలు పాటించాలని తెలిపారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి గా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. ‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్ కిట్’ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు వచ్చే వరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఎదో ఒకటి సమర్పించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these