పొత్తులతో తన గొయ్యి తాను తవ్వుకున్న చంద్రబాబు నాయుడు.. మళ్ళీ సీఎంగా వైఎస్ జగన్ గెలవడం పక్కా..!

ఏపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలలో టెన్షన్ నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇక వైయస్ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వైఎస్ జగన్ ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. బీజేపీ పొత్తు వలన ఎన్నికల సజావుగా సాగుతాయని లేదంటే వైయస్ జగన్ మనుషులు అరాచక పాలన చేస్తారని ఓట్ల విషయంలో తప్పులు జరుగుతాయని చంద్రబాబు నాయుడు కేంద్రంతో పొత్తు పెట్టుకున్నారు.

అయితే ఈ పొత్తు వలన వైయస్ జగన్ కి లాభాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో పొత్తు వలన టీడీపీ, జనసేన ప్రతి పార్టీకి ఉండే మైనారిటీ వర్గ ఓట్లన్నీ వైఎస్ జగన్ వైపు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ పార్టీ మైనారిటీ వర్గం ఎంతో కొంత వైయస్ జగన్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇది టీడీపీకి దెబ్బ పడినట్లు అవుతుంది.

ఇక వైయస్ జగన్ , చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం ఎప్పటి నుంచో ఎగబడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని పనులు జరగటానికి కేంద్రం సపోర్టు ఉండాలి. అందుకే ఏ పార్టీ అయినా బీజేపీతో మంచి సంబంధం కోసం ఎగబడుతుంది. అయితే ఈసారి బీజేపీ టీడీపీకి సపోర్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు కూటమిలో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు ప్రకటించారు. బీజేపీ కి ఆరు నుంచి ఏడు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో జనసైనికుల నుంచి వ్యతిరేకత ఉంటుంది. ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకు రెండు సీట్లు ఇవ్వడం ఏంటని, ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీకి ఆరు సీట్లు ఇవ్వటం ఏంటని చర్చ వస్తుంది. ఇప్పటికే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లను ప్రకటించగా దానిపై జనసైనికులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎంపీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఇవ్వడం జన సైనికులకు నచ్చే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే కూటమికి వ్యతిరేకత ఏర్పడుతుంది. అది వైయస్ జగన్ కు లాభంగా మారుతుంది.

ఈ పొత్తు వలన వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.అలాగే ముద్రగడ పద్మనాభం, చేగొండ రామజోగయ్య లాంటివారు వైసీపీ లోకి వెళ్లడం వలన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ ఓట్లని వారికి వెళ్లే అవకాశం ఉంటుంది. సీట్ల విషయంలో కూడా అసంతృప్తి ఉంది. పొత్తులోకి బీజేపీ రాకముందు సీట్లు తక్కువ ఇచ్చి బీజేపీకి ఎక్కువ ఇవ్వడం జనసైనికులు ఫీలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు వైసీపీ పార్టీలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరోవైపు వైఎస్ షర్మిల వామపక్షాలు అడుగులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభంగా మారనున్నాయి. బీజేపీ కలిసి రాకపోతే చంద్రబాబు నాయుడు వామపక్షాలతో ముందుకు వెళ్లాలని అనుకున్నారు. కానీ బిజెపి పొత్తు కుదుర్చుకుంది. రానున్న ఎన్నికల్లో వైయస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో టీడీపీకి జనసేన, బీజేపీ పొత్తుకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఇదంతా వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభంగా మారనుంది. చంద్రబాబు నాయుడు పెట్టుకున్న పొత్తు వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these