నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ప్రకటించడం ఆ జిల్లా రాజకీయాల్లో పెను సంచలనాలకు దారి తీస్తుంది. తన భార్యను కాదని ఒక సామాన్య మైనార్టీకి నెల్లూరు నగర టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి వైసీపీ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వేమిరెడ్డి, ఆయన ప్రత్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ప్రకటించడంతో ఖంగు తిన్నారు. టీడీపీలో చేరడం ఖాయమైనప్పటికీ, విజయసాయి రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం కంటే, పోటీ నుండి నిష్క్రమించి, ఉన్న కాస్త గౌరవాన్ని కాపుడోకోవడం మేలని ఆయన నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
