175 స్థానాలకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్‌… ఎన్నికల ప్రచారానికి ‘సిద్ధం’..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖపట్నంలోని భీమునిపట్నం నియోజకవర్గం నుంచి ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం.. ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చాం.. 175 స్థానాలకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్‌.. చంద్రబాబుతో సహా అందర్ని ఓడించాల్సిందే.. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయి.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు” అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగారు.సీఎం జగన్ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా. హెలికాప్టర్‌లో భీమ్లీ వద్ద సంగివలస చేరుకుని మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వరుసగా నాలుగు భారీ కేడర్ మీటింగ్‌లతో వైఎస్సార్‌సీపీ 2024 ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా తొలి మీటింగ్ ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాని క్యాడర్ హాజరైంది.శుక్రవారం సంగివలసలో సీఎం పర్యటన సభలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు హాజరు అయ్యారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these