Padma Awards 2024: మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడుకు  పద్మవిభూషణ్‌..

Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును ప్రకటించింది. 2024కి గాను మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. అందులో  ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది.

కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు, పౌర సేవలు మొదలైన రంగాలలో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. 2024కి గాను మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి.

పద్మవిభూషణ్ అవార్డుగ్రహీతలు

వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు

కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్‌

బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బిహార్‌పద్మ

సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these