ప్రమాదానికి ముందు ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ఆకివీడులో అంగనవాడి కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పాల్గొని వారితో మాట్లాడారు. అనంతరం పాలకొల్లు వెళుతుండగా మార్గమధ్యలో చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో షేక్ సాబ్జి తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.
